: ‘వశం’ దెయ్యాలు, భూతాలకు సంబంధించిన సినిమా కాదు!: రచయిత, నటుడు వైఎస్ కృష్ణేశ్వరరావు


చల్లా శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందిన క్రౌడ్ ఫండింగ్ మూవీ ‘వశం' ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు, రచయిత వైఎస్ కృష్ణేశ్వరరావు మాట్లాడుతూ, ఈ సినిమా కథ, నిర్మాణ పరంగా కొత్త ఒరవడిని సృష్టించేందుకు దర్శకుడు ప్రయత్నించారని అన్నారు. ఈ సినిమా దెయ్యాలు, భూతాలకు సంబంధించినది కాదని చెప్పారు. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరిన కృష్ణేశ్వరరావు, ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించిందుకు సంతోషం వ్యక్తం చేశారు.

కాగా, దర్శకుడు చల్లా శ్రీకాంత్ మాట్లాడుతూ, సైన్స్, ఫిలాసఫీ అంశాలను ఆధారంగా చేసుకుని నిర్మించే చిత్రాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని అన్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని, ముఖ్యంగా విద్యార్థులను ఈ చిత్రం బాగా ఆకర్షిస్తుందని అన్నారు. ‘వశం’లో నందకుమార్, వాసుదేవరావు, శ్వేతా వర్మ తదితరులు ప్రధానపాత్రల్లోనటించగా, జోస్యభట్ల శర్మ సంగీతం అందించారు.  

  • Loading...

More Telugu News