: హీరో విశాల్ సలహాపై మండిపడ్డ రోజా భర్త ఆర్కే సెల్వమణి
తమిళనాడులో సినిమా షూటింగ్ లు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) ఆందోళనకు దిగడంతో... షూటింగ్ లకు అంతరాయం కలిగింది. ఈ నిరసనలో 24 సంఘాలకు చెందిన దాదాపు 25 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 20 సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. ఇందులో రజనీకాంత్ సినిమా 'కాలా' కూడా ఉంది. అయితే వీరి డిమాండ్లను తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్పీసీ) తోసిపుచ్చింది.
ఇటీవల కాలంలో నిర్మాతల సంఘానికి, కార్మికుల సంఘానికి మధ్య విభేదాలు బాగా ముదిరిపోయాయి. ఈ నేపథ్యంలో, కార్మికుల సంఘంలో లేని వారితో షూటింగ్ లు చేసుకోవాలంటూ నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్ సలహా ఇచ్చాడు. దీనిపై వైకాపా ఎమ్మెల్యే రోజా భర్త, కార్మికుల సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మండిపడ్డారు. విశాల్ సలహా కార్మికుల పొట్ట కొట్టే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.