: మై హీరో గ్రేటెస్ట్: హీరోయిన్ సమంత


ఆర్వీ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘యుద్ధం శరణం’. ఈ చిత్రం టీజర్ ను నిన్న విడుదల చేయడం, దీన్ని తన ట్విట్టర్ వేదికగా నాగచైతన్య పంచుకోవడం తెలిసిందే. ఈ ట్వీట్ కు చైతూకు కాబోయే భార్య, హీరోయిన్ సమంత స్పందించింది. ‘మై గ్రేటెస్ట్ హీరో!’ అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా సమంత రిప్లై ఇచ్చింది.

కాగా, ‘శత్రువులు ద్రోహం చేసినా, ఆశలు ఆవిరైనా... నేను ధైర్యంగా జీవించగలను’ అంటూ నాగచైతన్య నిన్న తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ‘యుద్ధం శరణం’ టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకూ 11 లక్షల మందికి పైగా దీనిని వీక్షించారు. ఈ చిత్రం టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది.

  • Loading...

More Telugu News