: రాత్రుళ్లు ఫోన్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు: పోలీసులకు హాట్ బాంబ్ కోయినా మిత్రా ఫిర్యాదు


ప్రతి నిత్యమూ తనకు ఫోన్ చేసి లైంగికంగా వేధిస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిపై బాలీవుడ్ హీరోయిన్, ఐటం సాంగ్స్ హాట్ బాంబ్ కోయినా మిత్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. గడచిన వారం రోజుల్లో 50 ఫోన్ నంబర్ల నుంచి తనకు కాల్స్ వచ్చాయని, తొలుత కాల్స్ ను పట్టించుకోలేదని తెలిపిన ఆమె, 'రాత్రికి వస్తావా? డబ్బులిస్తాను', అని నీచంగా మాట్లాడుతున్నారని తెలిపింది. అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారని పేర్కొంది. కోయినా మిత్రా ఫిర్యాదుపై ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేశామని, కాల్స్ వచ్చిన నంబర్ల ఆధారంగా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, రోడ్, హే బేబీ, ముసాఫిర్, ఏక్ హసీనా ఏక్ ఖిలాడీ తదితర చిత్రాలతో పాటు, పలు బాలీవుడ్ సినిమాల్లో కోయినా మిత్రా ఐటం సాంగ్స్ చేసి పాప్యులర్ అయింది.

  • Loading...

More Telugu News