: విష్ణుకు 4 నుంచి 6 వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు: మంచు లక్ష్మి


'ఆచారి అమెరికా యాత్ర' సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా, ఓ ఛేజింగ్ సీన్ ను చిత్రీకరిస్తుండగా, మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్ బైక్ పై నుంచి కిందకు పడ్డారు. దీంతో, గాయాలపాలైన విష్ణుకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

ఈ సందర్భంగా తన సోదరుడు విష్ణును 4 నుంచి 6 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలంటూ డాక్టర్లు సూచించారని మంచు లక్ష్మి తెలిపారు. తన సోదరుడు కోలుకోవాలంటూ అందరూ ప్రార్థించాలని విన్నవించారు. విష్ణును కచ్చితంగా దైవదూతలే కాపాడారని చెప్పారు. మరోవైపు, ఇదే విషయంపై మోహన్ బాబు స్పందిస్తూ, విష్ణు కోలుకోవడానికి ఇంకొంచెం సమయం పడుతుందని ట్వీట్ చేశారు. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News