: ఎయిరిండియా సిబ్బందిని భయపెడుతున్న దెయ్యాలు!


అమెరికాలోని షికాగో వెళ్లే ఎయిరిండియా సిబ్బంది భయంతో వణికిపోతున్నారు. ఎయిరిండియా తన సిబ్బందికి షికాగోలోని ఒక స్టార్ హోటల్ లో బస ఏర్పాటు చేస్తూ వస్తోంది. అయితే ఆ హోటల్ లో 'బసవద్దు బాబోయ్' అని సిబ్బంది మొత్తుకుంటున్నారు. ఎందుకంటే ఆ స్టార్ హోటల్ లో దెయ్యాలున్నాయట!

ఆ హోటల్ లో అడుగుపెట్టగానే వింత శబ్దాలు వినిపిస్తాయని చెబుతున్నారు. అంతే కాకుండా కళ్ల ముందు దెయ్యం నీడ ప్రత్యక్షమవుతుందని వారు చెబుతున్నారు. ఆ తరువాత హోటల్ రూంకి సంబంధించిన కిటికీలు, తలుపులు ఊగుతూ ఉంటాయని వారు తెలిపారు. దీంతో ఆ హోటల్ లో బస చేసేందుకు ఎయిరిండియా సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. హోటల్ లో పారానార్మల్ యాక్టివిటీ తరహాలో సంఘటనలు చోటుచేసుకుంటాయని, వారి ప్రవర్తనలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయని వారు చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ హోటల్ లో చోటుచేసుకుంటున్న ఘటనలపట్ల విచారణ ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News