Thamanna: సినిమా కబుర్లు... సంక్షిప్త వార్తలు


*  తనకు కమర్షియల్ సినిమాలు, కథాబలమున్న సినిమాలు రెండూ ఒకటేనని అంటోంది కథానాయిక తమన్నా. "నేను రెండు రకాల చిత్రాలు చేశాను. ఓ రకంగా చెప్పాలంటే కమర్షియల్ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకోవడం కాస్త కష్టమే. ఎందుకంటే, కథాబలమున్న చిత్రాలలో పాత్ర కోసం కష్టపడాలి. కమర్షియల్ చిత్రాలలో గ్లామర్ పరంగా అభినయం చూపాలి" అని చెప్పింది తమన్నా.    
*  బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న 'జయ జానకి నాయక' చిత్రం ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఆడియో సీడీలను విడుదల చేయగా, బోయపాటి శ్రీను తొలి సీడీని స్వీకరించారు.
*  మహేశ్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'స్పైడర్' చిత్రానికి సంబంధించిన తొలిపాటను రేపు (ఆగస్టు 2) విడుదల చేస్తారు. అలాగే మహేశ్ జన్మదినం సందర్భంగా ఆగస్టు 9న స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేస్తారు.
*  రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి 'ఉన్నది ఒకటే జిందగీ' టైటిల్ని ఖరారు చేశారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు త్వరలో ఊటీలో మొదలవుతుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  

Thamanna
  • Error fetching data: Network response was not ok

More Telugu News