: నేడు సిట్ ముందుకు గీతా మాధురి భర్త నందు!


డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల సిట్ విచారణ చివరి అంకానికి చేరుకుంది. నోటీసులు జారీ చేసిన 12 మంది సినీ ప్రముఖుల విచారణ నేటితో పూర్తి కానుంది. ప్రముఖ గాయని గీతా మాధురి భర్త నందు నేడు సిట్ ముందు విచారణకు హాజరు కానున్నాడు. కాగా, ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడు, హీరోలు తరుణ్, నవదీప్, రవితేజ, తనీష్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, ముమైత్ ఖాన్, ఛార్మీ తదితరులు విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News