: ఆమాత్రం ప్రభావమేనా ఉంటుందని కేసీఆర్ చెప్పినందుకు ధన్యవాదాలు: పవన్ కల్యాణ్
తన సర్వేలో పవన్ కల్యాణ్ ప్రభావం ఏపీలో కేవలం 2 శాతమే ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపిన సంగతి తెలిసిందే. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఏపీలో తన ప్రభావం 2 శాతం ఉంటుందని చెప్పినందుకు ధన్యవాదాలని అన్నారు. తన ప్రభావం ఎంత ఉంటుందో తనకు తెలియదని ఆయన అన్నారు. తానింకా ప్రజల్లోకి వెళ్లలేదని ఆయన అన్నారు.
తనకు పాదయాత్ర చేయాలని ఉందని, అయితే తాను పాదయాత్ర చేస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. అందుకే పాదయాత్రపై ఆలోచించాలని అన్నారు. ప్రజల్లోకి వెళ్లిన తరువాతే తనపై ఎంత బరువుంది, ఎంత బాధ్యతను ప్రజలు అప్పగిస్తున్నారు? అన్న విషయాలు అర్ధమవుతాయని ఆయన చెప్పారు. అంతవరకు తనపై ఎలాంటి బాధ్యతలు ఉన్నాయో చెప్పలేనని ఆయన తెలిపారు.