: మంచు విష్ణు మాత్రమే కాదు నేను కూడా గాయపడ్డాను...సానుభూతి చూపిన వారికి ధన్యవాదాలు: ప్రగ్యా జైస్వాల్


మలేసియాలో 'ఆచారి అమెరికా యాత్ర' సినిమా కోసం ఛేజింగ్ సీన్లు చిత్రీకరిస్తుండగా బైక్ కిందపడి, హీరో మంచు విష్ణుకు గాయాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేశారు. విష్ణు గాయాలపై అతని కుటుంబం వివరణ కూడా ఇచ్చింది. అయితే అదే బైక్ పై హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా ఉందని, ఆమెకు ఏమీ కాలేదని మొదట్లో వార్తలొచ్చాయి.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ స్పందించింది. ప్రమాదంపై మంచు విష్ణు వివరణ ఇస్తాడని చెప్పింది. తనకు కూడా గాయాలయ్యాయని చెప్పింది. అయితే ప్రమాదం లేదని వివరించింది. గాయపడ్డామని తెలియగానే సానుభూతి చూపి, కోలుకోవాలని కోరిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది. 

  • Loading...

More Telugu News