: ఒలింపిక్స్‌లో క్రికెట్... వద్దంటున్న బీసీసీఐ!
1900 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఒక క్రీడగా ఉండేది. రానున్న 2024 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను పెట్టాలని అంతర్జాతీయ క్రికెట్ సంఘం ఆరాటపడుతోంది. అందుకు బీసీసీఐ మద్దతు కావాలి. కానీ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండటానికి బీసీసీఐ మొదటి నుంచి వ్యతిరేకమే. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకారం టాప్ క్రికెట్ బోర్డుల మద్దతు ఉంటేనే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడం కుదురుతుంది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ నుంచి ఐసీసీకి మళ్లీ నిరాశే ఎదురవుతుందని బీసీసీఐ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
ఈ విషయంలో బీసీసీఐని అన్ని రకాలుగా ఒప్పించేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది. వారి ప్రయత్నాలు వృథా ప్రయాసని క్రికెట్ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నాయి. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో ప్రవేశపెడితే బీసీసీఐ మీద ఒలింపిక్ కమిటీ ఆధిపత్యం పెరగడం, ప్రస్తుతం క్రికెట్ ద్వారా వస్తున్న ఆదాయానికి గండి పడే అవకాశం ఉండటం వంటి కారణాల దృష్ట్యా బీసీసీఐ నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.