: పవన్ కల్యాణ్ కు అంత క్రేజ్ ఉండటానికి కారణమిదే: శేఖర్ కమ్ముల
వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా ఉన్నతమైన వ్యక్తి అని సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. ప్రస్తుత హీరోలు తమ మొదటి సినిమాలోనే అన్ని విద్యలను ప్రదర్శిస్తున్నారని... పవన్ కల్యాణ్ తన తొలి నాళ్లలో తొలిప్రేమ, సుస్వాగతం, తమ్ముడులాంటి కొన్ని మంచి సినిమాలు చేశారని... ఆ సినిమాల్లో పవన్ మన పక్కింటి అబ్బాయిలాగానే ఉంటారని చెప్పారు. పవన్ ఏదైనా తప్పు చేసినా, దాన్నుంచి నేర్చుకుంటారని... నేల విడిచి సాము చేయరని కొనియాడారు. అందుకే పవన్ ను అందరూ సొంతం చేసుకున్నారని చెప్పారు. పవన్ కు ఈ స్థాయిలో క్రేజ్ ఉండటానికి అదే కారణమని తెలిపారు.