: విక్రమ్ గౌడ్ కేసులో కొత్త ట్విస్టు...!


మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు ఓ కొలిక్కి వస్తోంది. ఆయనపై ఆగంతుకులు కాల్పులు జరిపారన్నది ఓ కట్టుకథ అని పోలీసులు తేల్చి చెబుతున్నారు. దీంతో విక్రమ్ గౌడ్ పై కేసు నమోదు చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. అలాగే ఆయన భార్య షిపాలీకి (లోతైన విచారణ కోసం) సీఆర్సీ సెక్షన్ 41 కింద నోటీసులివ్వనున్నట్టు తెలుస్తోంది. రేపు ఉదయానికి ఈ కేసు విషయంలో ఒక క్లారిటీ వస్తుందని వారు చెప్పారు. విక్రం ఇంట్లో రక్తం ఎందుకు తుడిచేశారు? పని మనిషి ఏమైంది? తుపాకీ ఏమైంది? వంటి విషయాలపై దర్యాప్తు చేసిన పోలీసులు రేపు ఉదయానికి స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News