: మలేసియాలో షూటింగులో గాయపడ్డ మంచు విష్ణు.. ఐసీయూలో చికిత్స!
టాలీవుడ్ యువనటుడు మంచు విష్ణుకు గాయాలయ్యాయి. 'ఆచారి అమెరికా యాత్ర' సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న మంచు విష్ణు.. షూటింగ్ సందర్భంగా బైక్ పై సన్నివేశం చిత్రీకరిస్తుండగా కిందపడి గాయపడ్డాడు. దీంతో వేగంగా స్పందించిన చిత్ర యూనిట్ విష్ణును ఆసుపత్రికి తరలించింది. కాగా, విష్ణును ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. గాయాలు కొంచెం బలంగా తగిలినట్టు తెలుస్తోంది. దీంతో చిత్రయూనిట్ ఆందోళనలో మునిగిపోయింది.