: కొరియా ప్రాంతంలో విహరించిన అమెరికన్ యుద్ధ విమానాలు


ఇంటర్నేషనల్ బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా విజయవంతంగా ప్రయోగించిన తరువాత, గంటలు తిరక్కుండానే అమెరికా, తన యుద్ధ విమానాలను కొరియన్ పెనిన్సులా ప్రాంతానికి పంపింది. అమెరికాకు చెందిన బీ-1బీ బాంబర్లు, కొన్ని ఫైటర్ జెట్ విమానాలను సౌత్ కొరియన్, జపాన్ వాయు సేనలకు చెందిన యుద్ధ విమానాలు కూడా కొరియా తీరంలో విహరించాయి. మొత్తం 10 గంటల పాటు పదుల సంఖ్యలో విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.

కాగా, గత శుక్రవారం నాడు నార్త్ కొరియా నెల రోజుల వ్యవధిలో రెండో ఐసీబీఎం పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచం కల్పించుకోవాల్సిన అత్యవసర ప్రమాదం ఈ రీజియన్ లో స్థిరత్వాన్ని నెలకొల్పడమేనని పసిఫిక్ ఎయిర్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ టెర్రెన్స్ వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా ఏమైనా అడుగులు వేస్తే, క్షణాల్లోనే తాము స్పందించగలమని, అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలను ప్రయోగించినా, వాటిని సమర్థవంతంగా అడ్డుకుని భూ ఉపరితలానికి వందల కిలోమీటర్ల ఎత్తునే పేల్చి వేయగలమని అన్నారు.

  • Loading...

More Telugu News