: సినీ ప్రముఖుల పేర్లు చెప్పవద్దని ఒత్తిడి తెస్తున్నారు: అకున్ సబర్వాల్ కీలక వ్యాఖ్యలు


తాము విచారిస్తున్న డ్రగ్స్ కేసులో బయటపడుతున్న సినీ ప్రముఖుల పేర్లను వెల్లడించవద్దని ఒత్తిడి, బెదిరింపులు వస్తున్నాయని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లోని రామకృష్ణ మఠంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఎంత ఒత్తిడి వచ్చినా పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నానని అన్నారు. ఈ కేసులో సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తల పిల్లలు, కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఎవరినీ వదలవద్దని సీఎం నుంచి తనకు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. డ్రగ్స్ వాడినా కూడా జైలు శిక్ష ఉంటుందని, రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. సిగరెట్లు, మద్యం తదితర అమ్మకాలను నియంత్రించే అధికారం తప్ప, దుకాణాలు మూసివేసే అధికారం తమకు లేదని అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News