: బిగ్ బాస్ హౌస్ లో చికెన్ వండించుకుని తిన్న జూనియర్ ఎన్టీఆర్
బిగ్ బాస్ హౌస్ లో టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చికెన్ వండించుకుని తిన్నాడు. గత 20 రోజులుగా తన తరువాతి సినిమా షూటింగ్ కోసం పూణే పరిసరాల్లోనే ఉన్నానని, అందుకే నాలుక చప్పబడిపోయిందని చెప్పాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్, క్రిటిక్ కత్తి మహేష్ షోలో పలు మార్లు చికెన్ బాగా వండుతానని చెప్పిన విషయాన్ని గుర్తు చేసి, చికెన్ పంపి వండమని చెప్పారు. కత్తి మహేష్ కు సహాయంగా జూనియర్ ఎన్టీఆర్ కత్తి కార్తీకను పంపాడు. వీరిద్దరూ వండిన చికెన్ ను జూనియర్ ఎన్టీఆర్ ఆనందంగా తిన్నాడు. కిందకూర్చుని తిని, చికెన్ చాలా బాగుందని చెప్పాడు. ఆ చికెన్ కు కత్తి చికెన్ అని పేరుపెడుతున్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. అనంతరం సింగర్ మధుప్రియ షో నుంచి ఎలిమినేట్ అయిందని చెప్పాడు.