: వివాదాల సినిమా `ఇందూ సర్కార్` కలెక్షన్లు అంతంత మాత్రమే!
వివాదాస్పద కథతో మాధుర్ భండార్కర్ తెరకెక్కించిన `ఇందూ సర్కార్` సినిమా ఎట్టకేలకు థియేటర్లకు వచ్చింది. విడుదలకు ముందే చాలా హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చూపించలేకపోతోంది. 1975 అత్యవసర పరిస్థితి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మొదటిరోజు రూ. 85 లక్షలు నెట్ మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఇందిరా గాంధీ పాత్రలో సుప్రియా వినోద్, సంజయ్ గాంధీ పాత్రలో నీల్ నితిన్ ముఖేష్‌లు బాగానే మెప్పించినా, కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ సినిమా అనుకున్నంత సాధించలేకపోయింది. వివిధ రకాలుగా నిరసనలు తెలియజేస్తూ ఈ సినిమా విడుదలను ఆపడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో మాధుర్ భండార్కర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం రక్షణ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే!