: చిన్న‌పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణా కేసులో ఎంపీ రూపా గంగూలీని ప్ర‌శ్నించిన సీఐడీ


జ‌ల్పైగురి చిన్న‌పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణా కేసులో బీజేపీ ఎంపీ రూపా గంగూలీని ప‌శ్చిమ బెంగాల్ సీఐడీ ప్ర‌శ్నించింది. ఈ కేసులో నిందితురాలిగా అరెస్టైన బీజేపీ మ‌హిళా విభాగం మాజీ సెక్ర‌ట‌రీ జుహీ చౌద‌రిని క‌ల‌వ‌డంపై సీఐడీ ఆమెను ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది. ఇదే కేసులో బీజేపీకి చెందిన కైలాష్ విజ‌య‌వ‌ర్గియ‌ స‌హా మ‌రో ఇద్ద‌రు నేతల్ని సీఐడీ విచారించిన‌ట్లు స‌మాచారం. నిబ‌ద్ధ‌త లేని ఆధారాలు చూపించి చిన్న‌పిల్ల‌ల‌ను విదేశీయుల‌కు అమ్మిన కేసులో డార్జిలింగ్ పిల్ల‌ల సంర‌క్ష‌ణ అధికారి సహా మ‌రి కొంద‌ర్ని ఈ కేసులో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News