: అల్లు అర్జున్ ను అధిగమించిన వరుణ్ తేజ్ సినిమా!
లేనిపోని హడావుడి, భారీ ప్రమోషన్లు లేకుండానే సైలెంట్ గా వచ్చిన 'ఫిదా' సినిమా ప్రేక్షకుల మనసులను టచ్ చేసింది. కథనే నమ్ముకుని సినిమాను తీసిన శేఖర్ కమ్ముల హిట్ కొట్టాడు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం, విదేశాల్లో 1 మిలియన్ మార్క్ ను ఈ సినిమా దాటింది. ఫిదా సినిమాను నిర్మించిన దిల్ రాజే... దువ్వాడ జగన్నాథం మూవీని కూడా నిర్మించాడు. అయితే, నిర్మాతకి డీజే నష్టాలనే మిగిల్చిందని తెలుస్తోంది. ఓవర్సీస్ లో 9 కోట్లకు అమ్ముడుబోయిన ఈ సినిమా... కలెక్షన్స్ లో కూడా వెనుకబడింది. డీజే కలెక్షన్లను వారం రోజుల్లోనే ఫిదా దాటిందని సమాచారం. ఈ సినిమాకు కేసీఆర్ ప్రశంసలు కూడా దక్కిన సంగతి తెలిసిందే.