: రజనీ తర్వాతి సినిమా ఖరారైంది!
`కాలా` చిత్రం పూర్తైన తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్, జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ దర్శకత్వంలో నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల వెట్రిమారన్ చెప్పిన కథ రజనీకి నచ్చడంతో తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రజనీ అల్లుడు, నటుడు ధనుష్‌తో వెట్రిమారన్ కు మంచి స్నేహం ఉంది. గతంలో వీళ్లిద్దరూ కలిసి మంచి సందేశం ఉన్న `పొల్లదావన్`, `ఆడుకాలం` సినిమాలు తీశారు. ప్రస్తుతం రజనీ పా రంజిత్ దర్శకత్వంలో మాఫియా నేపథ్యంలో సాగే `కాలా` సినిమాలో నటిస్తున్నారు. వెట్రిమారన్, ధనుష్ హీరోగా `వడ చెన్నై` అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం 2017 అకాడమీ అవార్డులకు భారత్ తరఫున ఎంపికైన తన చిత్రం `విసరణై` ప్రచార కార్యక్రమాల్లో వెట్రిమారన్ బిజీగా ఉండటంతో `వడ చెన్నై` షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.