: ఆఫర్లో లొసుగును తెలివిగా వాడుకున్నాడు.. ఏడాది పాటు మంచి భోజనం లాగించేశాడు!
వినియోగదారులను ఆకర్షించడానికి పెద్ద పెద్ద సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తాయి. అలాగే తమ సదుపాయాల్లో లోటు కలిగినపుడు అందుకు ప్రతిగా కొన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తాయి. అలాగే చైనాలోని షాంఘై విమానాశ్రయ నిర్వాహకులు కూడా ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణ టికెట్ కొన్న ప్రయాణికులకు ఉచిత భోజన సదుపాయం కల్పించారు. ఇదే అంశాన్ని వాంగ్ పో అనే యువకుడు అవకాశంగా తీసుకున్నాడు.
ఒక ఫస్ట్‌క్లాస్ టికెట్ కొనుక్కొని ఆ రోజుకు ఉచిత భోజనం చేసి, ఆ టికెట్‌ను కేన్సిల్ చేసి, వచ్చిన రిఫండ్ డబ్బుతో రెండో రోజుకు టికెట్ కొనేవాడు. తర్వాత రెండో రోజు కూడా భోజనం చేసి, మరుసటి రోజుకి టికెట్ రీ షెడ్యూల్ చేసుకునేవాడు. ఇలా 300 రోజుల పాటు ఉచిత భోజన సేవను ఉపయోగించుకుంటూనే ఉన్నాడు. ఈ తతంగాన్ని ఇటీవల గుర్తించిన విమాన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇతడు ఎలా ఆఫర్ లొసుగును ఉపయోగించుకున్నాడో తెలిసి అందరూ నోరెళ్లబెట్టారు.