: అచ్చెన్నాయుడుకి బుర్ర లేదు... ఇప్పుడు చెప్పండి, ఎవరిని చెప్పుతో కొట్టాలి?: రోజా రిటార్ట్
కులం పేరుతో ఎవరైనా రాజకీయాలు చేస్తే వారిని చెప్పుతో కొట్టండి అని పిలుపునిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు మనిషి మాత్రం ఎత్తుగా పెరిగారు కానీ, ఆయనకు బుర్ర ఉందో లేదో కూడా తెలియడం లేదని వైఎస్సార్సీపీ నేత రోజా ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆమె మాట్లాడుతూ, కులం పేరుతో రాజకీయాలు చేసింది ఎవరు? అని అడిగారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలను చూసి అచ్చెన్నాయుడు నిర్ణయించాలని సూచించారు.
కాపులకు రిజర్వేషన్ ఇస్తామని కుల రాజకీయం చేసిందెవరో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తరువాత కాపు కార్పోరేషన్ ఎర్పాటు చేసి, కుల రాజకీయం చేసిందెవరని ఆమె నిలదీశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీను నెరవేర్చమంటే ఆగ్రహావేశాలు పొడుచుకొచ్చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు ఆరోజు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన రోజున సామాజిక న్యాయం చేసే వ్యక్తి అని పొగిడిందెవరని ఆమె నిలదీశారు.