: త్రివర్ణ పతాకం పవిత్రమైంది!: మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై కేంద్రం కౌంటర్
భారత దేశ జాతీయ పతాకాన్ని హాస్యాస్పదంగా పరిగణిస్తూ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రం ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ఆమె వ్యాఖ్యలను విమర్శిస్తూ ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు.
`మెహబూబా మాటలు ఆశ్చరంతో పాటు నవ్వు తెప్పిస్తున్నాయి. త్రివర్ణ పతాకం మాకు పవిత్రమైనది. జమ్మూతో సహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అది రెపరెపలాడుతుంది. అధికారంలో ఉన్నంత మాత్రాన త్రివర్ణ పతాకం విషయంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదు!` అని జితేంద్ర సింగ్ హితవు పలికారు. భారత రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్ నివాసితులకు ప్రత్యేక అధికారాలిచ్చిన 35ఎ ప్రకరణలో ఏదైనా మార్పులు చేస్తే, అక్కడి ప్రజలు జాతీయ పతాకాన్ని తాకరని మెహబూబా హెచ్చిరించిన సంగతి తెలిసిందే!