: అజారుద్దీన్ రికార్డును బద్దలుకొట్టిన కోహ్లీ!


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో విరాట్ శతకాన్ని బాదాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 17వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు కెప్టెన్ గా కోహ్లీకి ఇది 10వ సెంచరీ. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ అజారుద్దీన్ రికార్డును కోహ్లీ అధిగమించాడు. కెప్టెన్ గా అజార్ 9 సెంచరీలను సాధించాడు. అయితే గవాస్కర్ కన్నా కోహ్లీ ఒక సెంచరీ వెనుకబడి ఉన్నాడు. గవాస్కర్ మొత్తం మీద 34 టెస్ట్ సెంచరీలు చేయగా... కెప్టెన్ గా ఉన్నప్పుడు 11 సెంచరీలు చేశాడు.

ఈ క్రమంలో టెస్టుల్లో 50 సగటును కూడా కోహ్లీ సాధించాడు. అంతేకాదు, మూడు ఫార్మాట్లలో 50కి పైగా సగటు సాధించిన ఏకైక బ్యాట్స్ మెన్ గా కోహ్లీ నిలిచాడు. 

  • Loading...

More Telugu News