: మనకంటే చైనా వారికే ఎక్కువ అర్హతలు ఉన్నాయి!: అరుణ్ శౌరీ సంచలన వ్యాఖ్యలు


చైనా నేతలతో మన నేతలను పోల్చుతూ కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ జర్నలిస్టు అరుణ్ శౌరి చేసిన వ్యాఖ్యలు పెనుకలకలం రేపుతున్నాయి. డోక్లాం సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకుంటుండగా, అరుణ్ శౌరీ అర్హతలను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు ఆగ్రహానికి కారణమవుతున్నాయి. 'అరుణ్ శౌరీ టాక్ జర్నలిజం' అంటూ జరిగిన ఒక సెమినార్ లో ఆయన మాట్లాడుతూ, చైనా యంత్రాంగంతో మన యంత్రాంగాన్ని పోల్చి చూసినా, వారి పోలిట్ బ్యూరోతో పోల్చి మన పోలిట్ బ్యూరోను చూసినా వారికే ఎక్కువ అర్హతలని అన్నారు. భారత నాయకత్వం కంటే చైనా నాయకత్వానికే ఎక్కువ అర్హతలున్నాయని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆ అర్హతలేంటో స్పష్టంగా చెప్పనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు పెను కలకలం రేపుతున్నాయి. 

  • Loading...

More Telugu News