: సంజ‌య్‌ద‌త్ `భూమి` సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల


సంజ‌య్‌ద‌త్ 58వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న త‌దుప‌రి చిత్రం `భూమి` సినిమా ఫస్ట్‌లుక్ ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌ను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సంజ‌య్‌ద‌త్ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ పోస్ట‌ర్ ట్విట్ట‌ర్‌లో ట్రెండ్‌గా మారింది. ఇందులో సంజ‌య్‌ద‌త్ కూతురిగా అథితిరావ్ హైద‌రీ న‌టిస్తోంది. ఈ పోస్ట‌ర్‌లో సంజ‌య్ ముఖం మీద ర‌క్తపు మ‌ర‌క‌ల‌తో, చెదిరిన గ‌డ్డంతో క‌నిపిస్తున్నాడు. ఐదేళ్ల జైలు శిక్ష త‌ర్వాత విడుద‌ల‌వ‌బోతున్న సంజ‌య్ మొద‌టి చిత్రం ఇది. ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సెప్టెంబ‌ర్ 22న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

  • Loading...

More Telugu News