: ప్రతి సోదరి తమ సోదరులకు రాఖీ పండుగకు హెల్మెట్ గిఫ్ట్ గా ఇవ్వాలి!: కల్వకుంట్ల కవిత


రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలసి టీఆర్ఎస్ పోటీ చేస్తుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని...  అవన్నీ కేవలం ఊహాగానాలే అని ఎంపీ కవిత తెలిపారు. తన సోదరుడు కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేష్ లు తప్పుడు ఆరోపణలు చేశారని... వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్యను పెంచకపోయినా... టీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమీ లేదని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో కేసీఆరే నిర్ణయిస్తారని ఆమె అన్నారు. డ్రగ్స్ కేసులతో సినీ పరిశ్రమను టార్గెట్ చేయాలనే ఆలోచన ఎవరికీ లేదని చెప్పారు. తన సోదరుడు కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దేశంలోని సోదరులందరి సంక్షేమం కోసం 'సిస్టర్స్ ఫర్ ఛేంజ్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోకుండా ఉండేందుకు ప్రతి సోదరి తమ సోదరులకు రాఖీ పండుగ సందర్భంగా హెల్మెట్ గిఫ్ట్ గా ఇవ్వాలని ఆమె తెలిపారు

  • Loading...

More Telugu News