: బెంగళూరు మెట్రో స్టేషన్లలో హిందీ బోర్డులు పెట్టొద్దు: కేంద్రానికి సీఎం లేఖ
హిందీ భాష తమకు అక్కర్లేదంటూ కర్ణాటక వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వారి ఉద్యమానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఆయన ఓ లేఖ రాశారు. బెంగళూరు మెట్రో స్టేషన్లలో హిందీ సైన్ బోర్డులు పెట్టరాదంటూ లేఖలో కోరారు. ఈ మేరకు మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. మరోవైపు, బెంగళూరులో హిందీ బోర్డులు ఎందుకంటూ కన్నడ ఉద్యమకారులు సోషల్ మీడియా ద్వారా చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది.