: ఫేస్ బుక్ ను నిషేధించే దిశగా పాకిస్థాన్!


సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ను నిషేధించే దిశగా పాక్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దైవదూషణ, చట్ట విరుద్ధ వ్యాఖ్యలు వంటివి అత్యంత వేగంగా విస్తరించేందుకు ఫేస్ బుక్, వాట్సాప్ లాంటివి కారణమవుతున్నాయని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో, కొత్తగా అకౌంట్లు క్రియేట్ చేసుకుంటున్న వారి ఖాతాలకు ఫోన్ నెంబర్లను కచ్చితంగా లింక్ చేసేలా చేయాలని ఫేస్ బుక్ ను పాక్ డిమాండ్ చేసింది.

దీనివల్ల అకౌంట్ హోల్డర్ల వివరాలను సులభంగా తెలుసుకునే వెసులుబాటు తమకు కలుగుతుందని తెలిపింది. అయితే, పాకిస్థాన్ డిమాండ్ ను ఫేస్ బుక్ తిరస్కరించింది. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఈమెయిల్ అడ్రస్ ఉంటే సరిపోతుంది. ఈ నేపథ్యంలో, దైవదూషణకు సంబంధించిన కామెంట్లపై ఫేస్ బుక్ దృష్టి సారించకపోతే... 2018 నాటికి ఫేస్ బుక్ ను నిషేధించే యోచనలో పాక్ ప్రభుత్వం ఉంది. 

  • Loading...

More Telugu News