: ఇవాళ అంతర్జాతీయ పులుల దినోత్సవం... సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పానికి నెటిజన్ల ఫిదా!
పులుల సంరక్షణ గురించి అవగాహన కల్పించడానికి 2010 నుంచి ప్రతి ఏడాదీ జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తన శైలిలో పులుల సంరక్షణ గురించి ప్రచారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన రూపొందించిన బెంగాల్ టైగర్ సైకత శిల్పం నెటిజన్ల మనసు దోచుకుంటోంది. `అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మన జాతీయ జంతువు పులిని కాపాడతామని ప్రతిజ్ఞ చేద్దాం` అంటూ ఆయన చేసిన ట్వీట్‌కు మూడు గంటల్లోనే 1000కి పైగా లైకులు, 300కి పైగా రీట్వీట్లు వచ్చాయి.