: రూ.2,000 నోట్ల రద్దు అంశంపై స్పందించిన కేంద్ర మంత్రి
రూ. 2వేల నోట్లను రద్దు చేయనున్నారనే వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ అగర్వాల్ స్పందించారు. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన చెప్పారు. 2వేల నోట్లు కొనసాగుతాయని తెలిపారు. అయితే, 2వేల నోట్ల ముద్రణను ఎందుకు తగ్గించారనే విషయంపై రిజర్వ్ బ్యాంక్ స్పందిస్తుందని చెప్పారు. త్వరలోనే రూ. 200 నోట్లను ప్రవేశపెడుతున్నట్టు ఆయన తెలిపారు.