: కొడుకుతో చదరంగం ఆడుతున్న కైఫ్... చెక్ చెబుతున్న ముస్లిం సంప్రదాయవాదులు


టీమిండియా వెటరన్‌ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ సామాజిక మాధ్యమాల్లో మరోసారి ముస్లిం మత సంప్రదాయవాదుల విమర్శలకు గురయ్యాడు. తన కుమారుడితో చెస్ (చదరంగం) ఆడుతున్న ఫోటోను సోషల్ మీడియాలోని తన ఖాతాలో మహ్మద్ కైఫ్ పోస్టు చేశాడు. దానికి ‘సత్రంగ్‌ ఖిలాడీ’ అని వ్యాఖ్యానించాడు. దీంతో ఆ పోస్టుపై సంప్రదాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదరంగం ఆడడం ఇస్లాంకు వ్యతిరేకం అంటూ మండిపడ్డారు. మరికొందరు కైఫ్ ను సమర్థిస్తూ ఇస్లాం చదరంగాన్ని నిషేధించలేదని, ఆట ద్వారా మోసం చేయడాన్ని నిషేధించిందని తెలిపారు. కాగా, గతంలో కైఫ్ సూర్యనమస్కారం చేస్తున్న ఫోటోను పోస్టు చేసినప్పుడు కూడా విమర్శలు రేగిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News