: సీసీ టీవీ పుటేజ్ పరిశీలించాం... ఆధారాలు సేకరిస్తున్నాం.. ప్రశ్నించి కేసును ఛేదిస్తాం: పోలీసులు
విక్రమ్ గౌడ్ కేసును ఛేదించేందుకు పలు ఆధారాలు సేకరిస్తున్నామని హైదరాబాదు పోలీసులు తెలిపారు. విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిగాయని అతని భార్య ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆమె ఫిర్యాదును స్వీకరించి వివిధ రూపాల్లో దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. సీసీ టీవీ పుటేజ్ ను పరిశీలించామని ఆయన చెప్పారు. 12 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన ఆయన నిద్రపోయిన తరువాత పూజా కార్యక్రమాలకు సిద్ధమయ్యే క్రమంలో కాల్పులు జరిగాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు.
అయితే బయటి నుంచి అనుమానిత వ్యక్తుల ఆనవాళ్లు సీసీ పుటేజ్ లో లభ్యం కాలేదని వారు తేల్చిచెప్పారు. ఈ కేసులో విక్రమ్ గౌడ్ ను ప్రశ్నించి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని వారు తెలిపారు. ఆయన గాయాలతో బాధపడుతున్నందున ఆయనను ప్రశ్నించేందుకు ఇది అనువైన సమయం కాదని భావిస్తున్నామని, ఆయనను విచారించిన అనంతరం మరింత లోతైన దర్యాప్తు చేపడతామని వారు వెల్లడించారు. ఈ కేసును ఛేదిస్తామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేశారు.