: రవితేజ మధ్యాహ్నం భోజనం చేయలేదు...సమాధానాలు రాబడుతున్న సిట్!
సిట్ విచారణ సందర్భంగా టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ మధ్యాహ్నభోజనం చేయలేదని సమాచారం. సిట్ అధికారులు భోజనం ఆఫర్ చేసినా రవితేజ తీసుకోలేదు. దీంతో రవితేజకు సిట్ అధికారులు డ్రై ఫ్రూట్స్ అందజేశారు. వాటిని ఆయన తీసుకున్నారు. సిట్ అడుగుతున్న ప్రశ్నలకు ఆయన ఆచితూచి సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. కాగా, పబ్ లలో డ్రగ్స్ ఉంటాయా? మీరు డ్రగ్స్ తీసుకుంటారా? డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తారు? ఎలాంటి వారికి అందజేసేవారు? మరోవైపు జిశాన్ తో పరిచయం ఎలా అయింది? కెల్విన్ ను జీశాన్ పరిచయం చేశాడా? జీశాన్ ను కెల్విన్ పరిచయం చేశాడా? అతనితో సంబంధాలు ఏంటి? వంటి ప్రశ్నలకు రవితేజ నుంచి సమాధానం రాబడుతున్నట్టు తెలుస్తోంది.