: జిల్లాల నుంచి భారీ ఎత్తున సిట్ కార్యాలయానికి చేరుకున్న రవితేజ అభిమానులు


ప్రముఖ సినీ నటుడు రవితేజను నేడు సిట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం సిట్ కార్యాలయం ముందు రవితేజ అభిమానులు ఆందోళన నిర్వహించారు. తమ హీరోను డ్రగ్స్ కేసులో అన్యాయంగా ఇరికిస్తున్నారని నినాదాలు చేశారు. సిట్ విచారణపై నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విచారణ సమయం గడుస్తున్న కొద్దీ జిల్లాల నుంచి రవితేజ అభిమానులు సిట్ కార్యాలయం వద్దకు భారీగా చేరుకుంటున్నారు. అభిమానుల సంఖ్య పెరుగుతుండడంతో సిట్ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. అయితే రవితేజ విచారణను 5 గంటలకే ముగిస్తారా? రాత్రి పది గంటల వరకు కొనసాగిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఆయన అభిమానులు మాత్రం తమ హీరో బయటకు వచ్చేవరకు అక్కడే ఉంటామని చెబుతుండడం విశేషం. 

  • Loading...

More Telugu News