: సినిమావాళ్లు ఆందోళన చెందడం లేదు.. ఇండస్ట్రీ ఇక్కడ నుంచి తరలిపోదు: తలసాని
డ్రగ్స్ కేసులో ప్రత్యేకంగా ఏ ఒక్కరినీ ప్రభుత్వం టార్గెట్ చేయలేదని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డ్రగ్స్ విచారణ వల్ల సినిమా పరిశ్రమలోనివారు ఆందోళనకు గురవున్నట్టు తన దృష్టికి రాలేదని ఆయన తెలిపారు. సినీ ఇండస్ట్రీలోని వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... టీఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ మేలు చేస్తుందని చెప్పారు. హైదరాబాదు నుంచి సినీ పరిశ్రమ తరలిపోయే అవకాశమే లేదని ఆయన అన్నారు. డ్రగ్స్ వ్యవహారం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ దెబ్బతినలేదని చెప్పారు.