: అల్లు అర్జున్ తో మైకేల్ జాక్సన్ జీవిత కథ తీయండి: నారాయణమూర్తి సలహా
డ్యాన్సింగ్ స్టార్, పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ జీవిత కథను టాలీవుడ్లో తీస్తే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచన పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తికి కూడా వచ్చింది. అందుకే టాలీవుడ్లో డ్యాన్స్‌లకు మారుపేరుగా చెప్పుకునే హీరో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో మైకేల్ జాక్సన్ జీవిత కథను నిర్మించాలని నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్‌ను ఆయన కోరారు. `ఫిదా` సినిమా సక్సెస్ మీట్‌కు అతిథిగా హాజరైన ఆర్.నారాయణమూర్తి వేదిక మీద మాట్లాడుతూ ఈ ప్రతిపాదన చేశారు. అలాగే సినిమా నిర్మాత దిల్రాజును పొగుడుతూ తక్కువ కాలంలోనే రామానాయుడు, విజయ బాపినీడు, అల్లు అరవింద్‌ల స్థాయికి ఎదిగాడని అన్నారు.