: భారత్ పట్ల మా నిర్ణయాన్ని మార్చుకోం: చైనా
భారత్ తో తాము రాజీపడే ప్రసక్తే లేదని చైనా తేల్చి చెప్పింది. డోక్లాం విషయంలో తమ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోబోమని తెలిపారు. తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవాలంటూ భారత్ చేసిన డిమాండ్ సరైంది కాదని... తమ భూభాగం నుంచి తమ సైన్యాన్ని ఎలా వెనక్కి తీసుకుంటామని ప్రశ్నించింది. ఈ మేరకు చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ లో కథనం వచ్చింది. బ్రిక్స్ సదస్సులో భాగంగా భారత సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ వెళ్లారు. దీంతో భారత్ విషయంలో చైనా రాజీపడుతుందని భారత మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, అలాంటి ఊహాగానాలకు తెరదించాలని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. భారత్ పట్ల తమ నిర్ణయం మారదని... భారత ప్రభుత్వం, మీడియా అలాంటి ఊహాగానాలను వదిలేయాలని సూచించింది.