: సిట్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన రవితేజ అభిమానులు!
డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు రవితేజను ఎక్సైజ్ సిట్ అధికారులు విచారిస్తున్నారు. నాలుగు గంటలకు పైగా ఆయన విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా కాల్విన్, జీషాన్ లతో ఉన్న సంబంధాలపై ఎక్కువగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, సిట్ కార్యాలయం వద్దకు రవితేజ అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. డ్రగ్స్ కేసులో రవితేజను అన్యాయంగా ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వారు ఆందోళనకు దిగారు. దీంతో, ఎక్సైజ్ కార్యాలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రవితేజ అభిమానులకు నచ్చజెప్పే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు.