: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా!
పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తన పదవికి రాజీనామా చేశారు. 1990లలో ప్రధానిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి, భారీ ఎత్తున లండన్ లో ఆస్తులను కూడగట్టారన్న ఆరోపణలపై విచారణ నిర్వహించిన పాక్ సుప్రీంకోర్టు... షరీఫ్ ను దోషిగా తేల్చింది. షరీఫ్ పై క్రిమినల్ కేసును నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని పదవి నుంచి వెంటనే తప్పుకోవాలంటూ షరీఫ్ ను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో షరీఫ్ రాజీనామా చేశారు. అనంతరం తన వారసుడి ఎంపికపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తన సోదరుడు, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి షెహబాజ్ షరీఫ్ ను ప్రధానిని చేయాలనే యోచనలో నవాజ్ ఉన్నారు. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ప్రధాని రేస్ లో ఉన్నారు.