: అతిగా నవ్వినందుకు భార్యను చంపిన భర్త
అమెరికాలో అలస్కా ప్రాంతంలో తనను చూసి అతిగా నవ్విందని కట్టుకున్న భార్యను చంపేశాడు భర్త. సరదాగా విహారయాత్రకు వెళ్లిన జంట కథ ఇలా విషాదాంతం కావడం దురదృష్టం. అలస్కాకు చెందిన క్రిస్టీ, కెన్నత్ మాంజరీస్ భార్య భర్తలు. విహారయాత్రకు వెళ్లి అక్కడ ఒక క్రూయిజ్ (పెద్ద ఓడ)లో బస చేశారు. రెండో రోజు గదిలో క్రిస్టీ రక్తపు మడుగులో చనిపోయి ఉండటాన్ని క్రూయిజ్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కెన్నత్‌పై కేసు నమోదు చేసి పోలీసులు విచారించగా తనను చూసి ఆమె చాలా సేపు వెకిలిగా నవ్విందని, అందుకే చంపేశానని అంగీకరించాడు. అంతకు మినహా ఒక్క విషయం కూడా చెప్పడం లేదని అలస్కా పోలీసులు తెలిపారు.