: ఇండ‌స్ట్రీకి రాక‌ముందే సాయి ప‌ల్ల‌విని పొగిడేసిన సమంత‌... వీడియో చూడండి


ఇత‌ర హీరోయిన్ల న‌ట‌న‌ను పొగ‌డ‌టంలో న‌టి స‌మంత ఎప్పుడూ ముందుంటుంది. `ఫిదా` హీరోయిన్‌ సాయి ప‌ల్ల‌విని ఆమె పొగ‌డ్త‌ల‌తో ముంచేస్తుంది. `సాయి ప‌ల్ల‌వి ఉంటే చాలు... సినిమా చూడ‌టానికి వేరే కార‌ణం అవ‌స‌రం లేదు` అంటూ ట్వీట్ చేసింది సమంత‌. నిజానికి సాయి ప‌ల్ల‌వి ఇండ‌స్ట్రీకి రాక‌ముందే స‌మంత ఆమె అభిన‌యానికి ఫిదా అయి పొగిడేసింది. `ఢీ` లేడీస్ స్పెష‌ల్‌లో సాయి ప‌ల్ల‌వి పార్టిసిపెంట్‌గా ఉన్న‌పుడు ఆ కార్య‌క్ర‌మానికి సమంత గెస్ట్ జ‌డ్జ్‌గా వెళ్లింది. అక్క‌డ సాయి ప‌ల్ల‌వి డాన్స్ చూసి `నువ్వు డాన్స్ చేస్తుంటే నా చూపు తిప్పుకోలేక‌పోయా!` అంటూ స‌మంత పొగిడింది.

  • Loading...

More Telugu News