: వెంకయ్యనాయుడిని కలసి, బహుమతిని అందజేసిన కేటీఆర్!
ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుని తెలంగాణ మంత్రి కేటీఆర్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ లు కూడా ఉన్నారు. దేశంలోని రెండో అత్యున్నత పదవి అయిన ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే తరఫున పోటీ చేయనున్న వెంకయ్యకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యకు చేనేత దుస్తులను, ఓ మొక్కను బహుమతిగా అందించారు.