: చార్మీ, ముమైత్ లను విచారించిన మహిళా అధికారులపై రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు
హీరోయిన్లు చార్మీ కౌర్, ముమైత్ ఖాన్ లను విచారించిన మహిళా అధికారిణులపై, ఎవరో చెబుతున్నారంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "చార్మీ, ముమైత్ లను విచారించిన మహిళా అధికారిణులకన్నా చార్మీ కౌర్, ముమైత్ ఖాన్ లు ఆరోగ్యంగా కనిపించారని కొంతమంది బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో బాధ్యతగల మన అధికారులు తప్పుగా అర్థం చేసుకుంటున్న యువతకు స్పష్టత ఇవ్వాల్సి వుంది" అని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు పెట్టాడు. ఈ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు ఎవరు చేశారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇక రాంగోపాల్ వర్మ వ్యాఖ్య వైరల్ కాగా, పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.