: వరుణ్ ముద్దొచ్చాడు...సాయి పల్లవి ప్రతిభగల నటి: అల్లు అరవింద్
వరుణ్ ఈ సినిమాలో చాలా ముద్దొచ్చాడని అల్లు అరవింద్ తెలిపాడు. ఫిదా సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, ఫిదాలో ప్రతిఒక్కరూ ఆకట్టుకున్నారని చెప్పారు. వరుణ్ గత సినిమాను చూసిన తర్వాత, వాడి చెయ్యి పట్టుకుని, దీనిపై ఎక్కువ ఆశలు పెట్టుకోకురా అని సలహా ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా చూసిన తరువాత వాడిని వెనుక నుంచి కౌగిలించుకుని, 'బాగుందిరా' అనగానే వాడి ముఖం వెలిగిపోయిందని అన్నారు. వాడు చాలా బాగా చేశాడని అన్నారు.
సాయిపల్లవి చాలా బాగా నటించి, సినిమా భారాన్ని మోసిందని అన్నారు. సాయిపల్లవి సినీ పరిశ్రమలో ప్రతిభ ఉన్న నటి అని, అద్భుతమైన డాన్సర్ అని కూడా ఆయన చెప్పారు. ఇక తండ్రి పాత్రలో నటించిన సాయిచంద్ ను చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. సాయిచంద్ కి చెల్లెలు పాత్రలో నటించిన దర్శకుడు శేఖర్ కమ్ముల తల్లిని చూస్తే... తన మేనత్త గుర్తుకొచ్చిందని ఆయన చెప్పారు.