: బీహార్ లో కొత్త ట్విస్ట్... రాహుల్ గాంధీని కలిసిన జేడీయూ అసమ్మతి కూటమి
బీహార్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామాతో బీహార్ రాజకీయాల్లో ఊహించని మలుపులు తిప్పిన నితీష్ కుమార్ వైఖరిపై జేడీయూలో అసమ్మతి రాజుకుంది. జేడీయూ అధినేత శరద్ యాదవ్ నేతృత్వం లో ఆ పార్టీ ఎంపీలు ఏఐసీసీ ఉపాథ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. బీహార్ లో బీజేపీతో జట్టు కట్టడం తమకు ఇష్టం లేదని, కలిసి వస్తే ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటూ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో బీహార్ రాజకీయం క్షణానికోలా మారుతోంది. అధికార పక్షాన్ని ఏకం చేస్తూ, విపక్షాన్ని చీల్చేందుకు నితీష్ కుమార్ రంగం సిద్ధం చేసుకోగా, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేస్తూ, ఇండిపెండెంట్లను కలుపుకుని, ఆర్జేడీని చీల్చి అధికారపగ్గాలు చేపట్టే బాధ్యతను లాలూ భుజాన వేసుకున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది.