: అనంతపూర్‌లో సందడి చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా అనంతపూర్‌లో సందడి చేసింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి 178వ శాఖను ఆవిష్కరించడానికి తమన్నా అనంతపూర్ విచ్చేసింది. ఈ విషయం తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. దక్షిణాది సినిమాకు తాను చేసిన కృషికి గాను ఇటీవల తమన్నాకు కన్‌ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అక్రిడేషన్ కమిషన్ వారు గౌరవ డాక్టరేట్ అందజేశారు. తెలుగు, తమిళ భాషల్లో 50కి పైగా సినిమాల్లో తమన్నా నటించింది. ప్రస్తుతం 4 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.