: ఏ పదవీ లేదు కాబట్టే.. కులచిచ్చు పెడుతున్నారు: ముద్రగడపై అచ్చెన్నాయుడు ధ్వజం


కాపు నేత ముద్రగడ పద్మనాభంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో పదవిలో కొనసాగినంత కాలం కాపుల గురించి ముద్రగడ పట్టించుకోలేదని... ఇప్పుడు ఏ పదవీ లేకపోవడంతో జనాల మధ్య కులచిచ్చు పెడుతున్నారని విమర్శించారు. తిరుపతిలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. కాపులకు ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకుంటారని అన్నారు. మరో మంత్రి అమరనాథ రెడ్డి మాట్లాడుతూ డబ్బున్నవారికి మంత్రి పదవులను చంద్రబాబు ఇవ్వడం లేదని... పార్టీ కోసం పని చేసినవారికే పదవులు ఇస్తున్నారని అన్నారు. 

  • Loading...

More Telugu News