: వెంటవెంటనే వికెట్లు టపాటపా... అశ్విన్, సాహా అవుట్
తిరుగులేకుండా 600 పరుగుల తొలి ఇన్నింగ్స్ స్కోరు చేసి డిక్లైర్ చేసి, లంకేయులను బ్యాటింగ్ కు పిలుస్తామని ఆశించిన భారత క్రికెట్ వీరాభిమానులకు నిరాశ కలిగేలా ఉంది. ఈ ఉదయం రెండో రోజు బ్యాటింగ్ చేసిన భారత జట్టు లంచ్ విరామ సమయం రాకుండానే నాలుగు వికెట్లు కోల్పోయింది. తొలుత పుజారా, ఆపై రహానేలు అవుట్ కాగా, 491 పరుగుల వద్ద సాహా (32 బంతుల్లో 3 ఫోర్లతో 16), 495 పరుగుల వద్ద అశ్విన్ (60 బంతుల్లో 7 ఫోర్లతో 47) వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో పాండ్యా, జడేజాలు ఆడుతున్నారు. ప్రస్తుతం భార స్కోరు 116 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 498 పరుగులు. లంక బౌలర్లలో ప్రదీప్ 5 వికెట్లను చేజిక్కించుకున్నాడు.